ఈమధ్య రేణుదేశాయ్ పేరిట పవన్‌కు వ్యతిరేకంగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిని తప్పని చెప్పమంటూ రేణుకు పవన్ అభిమానుల నుంచి మెసేజ్‌లు వెళుతున్నాయట. దీనిపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘ నా పేరుతో ఆ పోస్టును ఓ స్టుపిడ్ పొలిటికల్ పర్సన్ సర్క్యులేట్ చేస్తున్నాడని, ఆ పోస్ట్ గురించి కొందరు మంచిగా చెబుతున్నారు. మరికొందరు తిడుతున్నారు, భయపెడుతున్నారు. ఇంకొందరేమో ఆ మాటలు తప్పని నేను చెప్పాలని చెబుతున్నారు. నా కర్మ కాకపోతే గత ఐదేళ్లుగా నా తప్పు లేకుండానే నిందలు పడుతున్నాను. నా ఆత్మాభిమానం గురించి ఎవరైనా ఆలోచించారా?’ అని 5 సంవత్సరాలుగా తను పడుతున్న ఆవేదనను వెల్లడించారు. ‘‘నేను చివరకు ఇన్స్టాగ్రాం అయినా ప్రశాంతంగా వాడుకోవచ్చని భావించాను కానీ జీవితం మొత్తం పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. కొందరు వ్యక్తులు, ఎవరైతే నా తప్పు లేకున్నా, 5సంవత్సరాలుగా నన్ను నిందిస్తున్నారో, వారు నన్ను అన్నీ మరచిపోయి సైలెంట్‌గా ఉండమన్నారు!
నేను అన్నీ మరిచిపోయి సైలెంట్‌గా వుండమని సలహాలు ఇవ్వటానికి వీళ్ళెవరు అని మండిపడ్డారు. నేను నా ఆత్మాభిమానం, డిగ్నిటీ కాపాడుకునేందుకు ఏమైనా మాట్లాడితే వీళ్లంతా నన్ను వాటిని ‘సైలెంట్‌గా భరించు’ అన్నారు. నేను మాట్లాడితే నా సినిమాలు.. ఇంకా ఇతర విషయాలకు.. ఫ్రీ పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నట్టు నిందిస్తున్నారు! ఇదంతా పొలిటికల్ గేమ్ అని అవన్నీ పట్టించుకోవద్దని ఒక మంచి వ్యక్తి చెప్పారు. కల్యాణ్ గారి పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందో అప్పుడు నేను వచ్చి వాటిని సరి చేయాలా? నేను ఇలాంటి భేదభావంతో కూడిన సంఘంలో జీవిస్తున్నందుకు చాలా బాధపడుతున్నానని చెప్పారు. ఏదో ఒక రోజు తనకు ప్రశాంతత కలుగుతుందని భావిస్తున్నానని తెలిపారు. పవన్ గురించి తాను ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడనని చెప్పారు. ఏదో ఒకరోజు ప్రశాంతత నా చెంతకు చేరుతుందని నేను భావిస్తున్నానని నేనెప్పుడు కల్యాణ్ గారి గురించి పబ్లిక్‌లో ఎప్పుడూ మాట్లాడనని నా పిల్లల తండ్రి గురించి వ్యతిరేకంగా మాట్లాడమని ఏ రాజకీయ పార్టీ నన్ను ఇన్ఫ్లూయెన్స్ చేయలేదని పోస్ట్ పెట్టారు రేణు.