హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఫుల్ బిజీగా ఉన్నది . సరైన పాత్రలని ఎంచుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా బాగానే కొనసాగిస్తోంది. తాజాగా కాజల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ‘జనతా గ్యారేజ్’లో ఐటెమ్ సాంగ్ ఎందుకు చేసిందో కూడా కాజల్ చెప్పింది. ఆ సాంగ్ ఎన్టీఆర్ కోసమే చేశాను. తారక్ తో నేను ఎన్నో మూవీ లు చేశాను. నాకు ఆ పాట ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే ఆ పాట చేశాను అంటూ కాజల్ చెప్పింది.
కాజల్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ముంబయిలో పుట్టాను. మొదట్లో నాకు తెలుగు వచ్చేది కాదు. ఆ తర్వాత నేను తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నాను. నాకు తెలుగు, సెకండ్ లాంగ్వేజ్‌లా మారిపోయింది. పైగా తెలుగులోనే మళ్లీ బిజీ బిజీ అయ్యాను. అందుకే, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అంటూ కాజల్ చెప్పింది. తన వివాహం గురించి కూడా కాజల్ మాట్లాడుతూ.. మేం ప్రేమించుకున్నాం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని కాజల్ తెలియచేసింది .