టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ కావడానికి నాకు ఎటువంటి సంబంధం లేదని, టీడీపీ నేతలు అంటున్నట్లుగా నాకు చంద్రబాబు పై ఎటువంటి రాజకీయ కక్షలు లేవని స్పష్టం ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో నేను అస్సలు ఇండియాలోనే లేనని లండన్ లో ఉన్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది… బీజేపీతో సాన్నిహిత్యంగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు.
ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటుగా దాదాపు సగం మంది టీడీపీ వాళ్ళు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు అంటూ జగన్ చెప్పారు.ఇంత మద్దతున్నా చంద్రబాబు అవినీతిని ఈడీ మరియు ఐటి సంస్థలు చంద్రబాబు అవినీతిని నిరూపించాయంటూ జగన్ మాట్లాడారు. ఇప్పటికి అయినా టీడీపీ నాయకులు రాజకీయ కక్షలన్న మాటలు కట్టిపెట్టాలంటూ జగన్ చెప్పారు.