ఏదైనా అద్భుతం జరిగితేనే…లేకుంటే ఇండియా ఇంటికే

if any wonder happens india will go to final

లీగ్ దశలో అద్భుతంగా ఆడిన టీమిండియా టాపార్డర్ కీలకమైన సెమీస్ లో మాత్రం చేతులెత్తేసింది. ఐదు సెంచరీల హీరో రోహిత్ శర్మ, ఛేజింగ్ రారాజు కోహ్లీ, ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ అందరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేక ప్రత్యర్థికి వికెట్లప్పగించేశారు. 240 పరుగుల లక్ష్యఛేదనలో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కాసేపటికే నాలుగో వికెట్ చేజార్చుకుంది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ నిప్పులు చెరిగే బౌలింగ్ తో టీమిండియాకు అగ్నిపరీక్ష పెడుతున్నాడు. నిలదొక్కుకుంటున్న దశలో దినేశ్ కార్తీక్ (6) హెన్రీ విసిరిన ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 38 పరుగులు కాగా, క్రీజులో రిషబ్ పంత్ (19), హార్దిక్ పాండ్యా (5) ఆడుతున్నారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 3, బౌల్ట్ ఓ వికెట్ తీసి భారత్ లైనప్ ను కకావికలం చేశారు. దీంతో ఈరోజు మ్యాచ్ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గెలవదు అని ఫిక్స్ అయిపోయారు ఇండియన్స్.