సచిన్ క్రీజ్ లో కుదురుకుంటే ఔట్ కావడం చాలా కష్టం

భారత్ క్రికెట్ లో సువర్ణాక్షరాలలో లిఖించదగిన పేరు మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అయితే తాజాగా సచిన్ బ్యాటింగ్ విధానం గురించి అద్భుతంగా తెలిపారు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌. వీరు మాట్లాడుతూ.. సచిన్ ఒక్కసారి గానీ.. క్రీజులో కుదురుకున్నారు అంటే.. ఔట్‌ చేయడం ఎవరి తరం కాదని.. అది చాలా కష్టమని విషయమని అన్నారు. పరిస్థితులకు తగినట్లుగా.. బ్యాటింగ్‌ స్టైల్ ని మార్చుకోవడంలో నేర్పరి అయిన మాస్టర్‌ను బోల్తా కొట్టించడం అంత సులువు కాదని పనేసర్‌ స్పష్టం చేశారు.

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘సచిన్‌.. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడేవాడు. ఒక్కసారిగానీ.. క్రీజులో కుదురుకున్నాడంటే.. భారీ స్కోర్లపై గురిపెట్టేవాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌తో పోల్చుకుంటే.. మాస్టర్‌ బ్యాటింగ్‌ శైలి అసాధారణం, అద్భుతం.. ఎప్పుడు ఎలా ఆడుతాడన్నది ఊహించడం చాలా కష్టం. కానీ చాలా సార్లు ఔట్‌ చేసేందుకు ప్రయత్నించాను’ అని పనేసర్ వివరించారు.