టీడీపీ బాగుపడాలంటే ఏం చేయాలో చంద్రబాబుకు సలహా ఇచ్చారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి. పార్టీకి భవిష్యత్ ఉండాలంటే.. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను పక్కన పెట్టాలన్నారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. తాజా రాజకీయాలతో పాటూ జగన్ పాలన, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, మాజీ మంత్రి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఎంత ఎక్కువగా మాట్లాడితే.. పార్టీ అంత ఎక్కువగా భ్రష్టు పడుతుందని వ్యాఖ్యానించారు లక్ష్మీ పార్వతి. మహిళల్ని కించపరిచేలా లోకేష్ మాట్లాడుతున్నారు.. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. ఏపీ ప్రజా పరిపాలన సాగుతోందని.. జగన్ మంచి, మంచి నిర్ణయాలతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఓవైపు ఇల్లు బాగు చేస్తుంటే ఎలుకలు ఏడ్చినట్లుగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.