ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి అనంతరం, భారత్‌తో యుద్ధం జరిగితే తుపాకీతో సరిహద్దుకు వెళ్తారా?’ అని అక్కడి విలేకరి ప్రశ్నించగా.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడైన షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ .. ‘భారత్‌తో యుద్ధం జరిగితే, నేను ఇంగ్లాండ్ పారిపోతాను’ అని బదులిచ్చాడు. ‘ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనక్కి తగ్గాలని మీరు కోరుకుంటున్నారా..? అని మరో ప్రశ్న అడగగా. ఇందుకు మార్వాట్ బదులిస్తూ.. ‘నేను చెప్పినంత మాత్రాన మాటను వెనక్కి తీసుకునేందుకు మోదీ ఏమైనా నా పిన్ని కొడుకా? నేను చెబితే వెనక్కి వెళ్లడానికి… అంటూ పేర్కొన్నారు. దీంతో పాక్ ఎంపీ మార్వాట్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.