Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని నెలల క్రితం మలయాళి ముద్దుగుమ్మ భావన కిడ్నాప్ మరియు లైంగిక వేదింపుల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఒక హీరోయిన్‌ను కిడ్నాప్ చేయడంతో కేరళ ముఖ్యమంత్రి కూడా స్పందించి పోలీసులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే ఛేదించారు. కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి జైలు నుండి నటుడు దిలీప్‌కు ఉత్తరం రాయడం, దాని ద్వారా దిలీప్‌ను విచారించడంతో పోలీసులకు ఈ కేసుతో దిలీప్‌కు ప్రధానంగా సంబంధం ఉందని తేలింది.
దిలీప్ ఏకంగా 1.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని భావనను కిడ్నాప్ చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ సమయంలో భావన మాట్లాడుతూ దిలిప్ మంచి వాడు అని, ఆయనకు ఈ కేసుతో సంబంధం లేదు అంటూ చెప్పింది. దాంతో అవాక్కయిన పోలీసులు ఎంక్వౌరీని కొత్త కోణంలో చేస్తున్నారు. భావనకు దిలీప్‌కు అక్రమ సంబంధం ఉన్నట్లుగా వారు అనుమానిస్తున్నారు. అయితే దిలీప్ ఎందుకు భావనను కిడ్నాప్ చేయించాలని ప్రయత్నించాడు అనేది తెలియరాలేదు. మొత్తానికి భావన కేసు మరోసారి దేశ వ్యాప్తం చర్చనీయాంశం అయ్యింది.