పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆయన మీద తీవ్ర ఆరోపణలు మొదలయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ పై ఆయన మాజీ భార్య, బీబీసీ జర్నలిస్టు రెహమ్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన మాజీ భర్త, ప్రధాని ఇమ్రాన్ పెద్ద వ్యభిచారి అంటూ తీవ్ర విమర్శలు చేసారు రేహంఖాన్. ఇమ్రాన్ ను పెళ్లాడి ఆయనతో సరిపడక విడాకులు తీసుకున్న ఆమె ఈ మధ్యనే తన ఆత్మ కథను రాశారు. అందులో ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది.
ఇమ్రాన్ ద్విలింగ సంపర్కుడని ఆయనొక వ్యభిచారి అని డ్రగ్స్ కు బానిసంటూ ఆమె తీవ్ర ఆరోపణలు ఆ పుస్తకం ద్వారా చేశారు. ఇటీవల తన ‘ఆత్మకథ’ను విడుదల చేసిన ఆమె.. అందులో ఇమ్రాన్‌కు సంబంధించిన పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. ఇమ్రాన్‌కి ఐదుగురు అక్రమ సంతానం వున్నారని అందులో కొందరు ఇండియన్స్ అని ఆమె రాసిన అంశం పుస్తకంలో కీలకంగా మారింది.
తన పది నెలల వైవాహిక జీవితం, ఇమ్రాన్ వ్యక్తిగత జీవితం గురించి ఇందులో క్లియర్‌గా వివరించింది. అంతేకాదు ఇమ్రాన్ స్వలింగ సంపర్కుడని, ఆయన క్లోజ్ ఫ్రెండ్ మోబీతో శారీరక సంబంధం ఉందని, మోబీకి అప్పటికే పెళ్లి కూడా అయ్యిందని వెల్లడించింది. ఇమ్రాన్ బెడ్రూమ్లో ఖాళీ సిగార్ కేసులు, కేవై జెల్లీ ట్యూబులు ఉండేవని వివరించింది. ఇలా ఇమ్రాన్‌కు చాలామందితో అక్రమ సంబంధాలున్నాయని, వాళ్లలో కొందరు భారతీయ మహిళలు కూడా వున్నారని రాసుకొచ్చింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి ప్రేఫరన్స్ పొదుపుకు ఇచ్చి ఎలాగో నెట్టుకొస్తున్న ఇమ్రాన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఉంది. అయితే వ్యాఖ్యలపై ప్రధాని హోదాలో ఉన్న ఇమ్రాన్ ఇప్పటివరకు స్పందించలేదు.