పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆనందంలో

పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆనందంలో

‘‘భీష్మ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్‌ను పవర్ స్టార్ ప్రశంసించారు. “వెలకట్టలేని క్షణం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సార్’’ అని నితిన్ ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్‌ను వెంకీ కుడుములు సోమవారం కలిశారు.‘భీష్మ సినిమా తీసినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నన్ను అభినందించారు. మా మొత్తం టీమ్‌కు ఇది హై మూమెంట్. నాకైతే లైఫ్ టైమ్ మూమెంట్’’ అని ట్వీట్‌లో వెంకీ పేర్కొన్నారు. అయితే, పవన్ కళ్యాణ్‌ను కలవడానికి వెంకీ కుడుముల నిర్మాత దిల్ రాజు సహాయం తీసుకున్నారు. అందుకే, తన ట్వీట్‌లో దిల్ రాజుకు వెంకీ థ్యాంక్స్ చెప్పారు.

ప్రస్తుతం హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల ఆ ఆనందంలో మునిగి తేలుతున్నారు