తన కల నిజమైందన్న …థమన్

తన కల నిజమైందన్న ...థమన్

గత మూడు నెలలుగా ఎక్కడ చూసినా కూడా అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలు ట్రెండ్ అవుతున్నాయి.సినిమా ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం థమన్ క్రేజ్ ఆకాశంలో ఉంది. ఆయనతో తమ సినిమాలకు పాటలు ట్యూన్ చేయించుకునేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.

థమన్ నేడు పవన్ కళ్యాణ్ ను పింక్ రీమేక్ సెట్స్ లో మీట్ అయ్యాడట. సినిమా కోసం తాను ట్యూన్ చేసిన పాటను వినిపించేందుకు చాలా నర్వస్ అయ్యాడట. ఎంతో కాలంగా కలలు కంటున్న వ్యక్తిని కలవడం జరిగింది. నేను ఆయన కోసం మ్యూజిక్ చేశాను. . అతి త్వరలోనే మొదటి పాట మీ ముందుకు వస్తుందంటూ థమన్ చిన్న పిల్లాడి మాదిరిగా ఎమోషనల్ అయ్యి టెన్షన్ పడ్డట్లుగా చెప్పుకొచ్చాడు.

థమన్ మొదటి సారి పవన్ సినిమాకు పని చేసిన నేపథ్యంలో.. ఆయన్ను కలవడంతో ఫ్యాన్ మూమెంట్ తో పాటు కాస్త టెన్షన్ కూడా అయ్యాడు. మొత్తానికి పింక్ రీమేక్ లో ఉండే ఆ పాటను ది బెస్ట్ గా ఇచ్చి పవన్ మెప్పు పొందాలని థమన్ చాలా తాపత్రయ పడుతున్నాడు.