” పార్ట్ 2 ” నేనే పూర్తి చేస్తానన్న …. విశాల్

తమిళ్ హీరో విశాల్-మిస్కిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన `డిటెక్టివ్` తెలుగు- తమిళ్ భాషల్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. . నష్టాల్లో ఉన్న విశాల్ ఫిలిం ఫ్యాక్టరీని డిటెక్టివ్ సక్సెస్ లాభాల బాట పట్టించింది. ఒక్క హిట్ విశాల్ కు పేరుతో పాటు డబ్బును తీసుకొచ్చింది. ఆ నమ్మంతోనే ఆ సినిమాకు సీక్వెల్ గా అదే టైటిల్ తో డిటెక్టివ్ -2ని కూడా తెరకెక్కిస్తున్నారు. మిస్కిన్ సహా సేమ్ టీమ్ తోనే విశాల్ పార్ట్ -2ని కూడా ప్రారంభించాడు. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నాడు.

మిస్కిన్ పెట్టిన కండీషన్లతో పాటు..భారీగా పారితోషికం కూడా డిమాండ్ చేయడం సహా మిస్కిన్ ప్రవర్తన విధానం కూడా నచ్చలేదుట. మిస్కిన్ కారణంగా టైమ్ వేస్ట్ అవ్వడమే గాక.. మిగతా పనులన్ని డిలే అవుతున్నాయట. దీంతో విసుగు చెందిన విశాల్ `డిటెక్టివ్ -2` నుంచి మిస్కిన్ ని తప్పించినట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆ స్థానంలో విశాల్ ఎక్కి మెగా ఫోన్ పట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ తానే పూర్తి చేసి రిలీజ్ చేస్తానని టీమ్ కు తెలిపాడుట. ఎవరూ అధైర్య పడవద్దని సూచించాడుట. ఇప్పుడీ వార్త కోలీవుడ్ సహా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.