మహేష్ 25వ సినిమాను తెరకెక్కించే అదృష్టం ఎవరికి ఉంది?

మహేష్ 25వ సినిమాను తెరకెక్కించే అదృష్టం ఎవరికి ఉంది?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం ఇంకా థియేటర్స్ లోనే ఉంది.అయితే ఈ చిత్రం తర్వాత మహేష్ ఇప్పుడు ఏ దర్శకునితో చేస్తున్నారో అన్న ప్రశ్న మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది.మహేష్ కెరీర్ లో 25 వ సినిమాను తెరకెక్కించే అదృష్టాన్ని తెచ్చుకున్న వంశీతో అనుకుంటే అది కాస్తా ఇప్పుడు పక్కకు వెళ్ళిపోయింది.ఇప్పుడు ఆ స్థానాన్ని ఫ్యామిలీ డైరెక్టర్ పరశురాం తీరుస్తారు అంటే ఈ కాంబో పై వందకు వంద శాతం అధికారిక వెల్లడి ఇంకా రాలేదు.

దీనితో ఈ వార్తలు అన్నీ విని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా విసుగెత్తిపోయారు.ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టేసి మహేష్ ఈ సినిమాల్లో ఉన్నారో లేదు కానీ ఓ సినిమాలో అయితే పక్కాగా ఉన్నారని ఫిక్స్ అయ్యిపోతున్నారు.అదే మెగాస్టార్ మరియు కొరటాల కాంబోలో వస్తున్న మరో ప్రిస్టేజియస్ చిత్రం “ఆచార్య”. ఈ చిత్రంలో మహేష్ కనపడడం దాదాపు ఖరారు అయ్యిపోయింది అని గట్టి వార్తలే వినిపిస్తున్నాయి.మరి చిత్రంలో అయినా సూపర్ స్టార్ కనిపించడం ఖాయమా కాదా అన్నది చూడాలి.