“హరితహారం” ద్వారా నమ్మశక్యం కాని అటవీ పునరుద్ధరణ ఫలితాలు వెలువడుతున్నాయి.

"హరితహారం" ద్వారా నమ్మశక్యం కాని అటవీ పునరుద్ధరణ ఫలితాలు వెలువడుతున్నాయి.
అటవీ పునరుద్ధరణ

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘హరితహారం’ అన్ని వర్గాల ప్రజల అశీసులతో అడవులను పుననిర్మించటంలో మరియు పచ్చదనాన్ని పెంపొందించడంలో అద్భుతమైన ఫలితాలను రాబడుతుంది అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

అటవీశాఖ
అటవీశాఖ సిబంది చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు

ఈ దిశగా రాష్ట్ర అటవీశాఖ సిబంది చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు . సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 33 శాతం హరితహారం లక్ష్యాన్ని సాధించే వరకు అందరం కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను దృష్టిలోపెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన వెంటనే కార్యాచరణ రూపొందించింది అని అన్నారు