చారిత్రక భారత్, బంగ్లా గులాబి టెస్టులో బంగ్లాదేశ్ సారథి మొమినల్ హఖ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచు కున్నాడు. గులాబి బంతి టెస్టుకు పిచ్‌పై పచ్చిక ఎక్కువ ఉండడంతో వికెట్ పొడిగా ఉండటంతో బ్యాటింగ్ ఎంచుకున్నట్టు బంగ్లాదేశ్ సారథి మొమినల్ హఖ్ తెలిపాడు. మంచు కురిస్తే పచ్చికలో పడ్డ బంతి మరింత ఎక్కువగా తడుస్తుందనే ఉద్దేశంతో పొడిగానే ఉంచారు.
బంగ్లాదేశ్ నుండి ఆటగాళ్లు షాద్మన్ ఇస్లామ్, ఇమ్రుల్ కయేస్, మొమినల్ హఖ్, మహ్మద్ మిథున్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, లిటన్ దాస్, నయీమ్ హసన్, అబు జయేద్, అల్ అమిన్ హుస్సేన్, ఇబాదత్ హుస్సేన్ ఉండగా భారత్ నుండి మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ ఆడుతున్నారు.