భారత్ నేవీ కరోనా వారియర్స్ కు వందనం చేసింది. కరోనా ఆసుపత్రులపై పూలవర్షం కురిపించింది. వైద్యులకు సెల్యూట్ చేసింది. భారతదేశంలో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ సమయంలో కరోనాను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుటుంది. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తూ కరోనాను ధీటుగా ఎదుర్కొంటున్నాయి. కాస్త దేశంలోని కొన్ని రాష్ట్రాలలో కరోనా తగ్గుముఖం పడుతుంది.
అయితే కరోనా వైరస్ పై వైద్యులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వైద్యులకు, నర్సులకు, పోలీసులకు ఇప్పటికే ప్రజలు వివిధ రూపాల్లో సంఘీభావం తెలిపారు. కాగా ఈరోజు ప్రత్యేకంగా త్రివిధ దళాలు కోవిడ్ వారియర్స్ కు పూలవర్షం కురిపించి సంఘీభావం తెలిపాయి. హైదరాబాద్ లోని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ సిబ్బందిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూలవర్షం కురిపించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు ముందుగా గాంధీ హాస్పిటల్ కు చేరుకొని అక్కడి వైద్యులకు, పోలీసులకు పుష్పగుచ్ఛం ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత చేతక్ హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు.
అదేవిధంగా ప్రతి జిల్లాలోని కోవిద్ ఆసుపత్రి వద్ద సైనికులు మౌంటెయిన్ బ్యాండ్స్ ప్రదర్శిస్తున్నారు. కరోనా యోథులకు త్రివిధ దళాలు సెల్యూట్ చేశాయి. ఇలా దేశంలోని అన్ని కోవిడ్ ఆసుపత్రులపై ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. విశాఖలో కేజీహెచ్ పై నేవీ పూలవర్షం కురిపించింది. కాగా డాక్టర్లకు పష్పగుచ్ఛం ఇచ్చి నేవీ అధికారులు ధన్యవాదాలు తెలిపారు.