Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొద్దిరోజుల్గా పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతి రోజూ పెరుగుతుండటంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో 17 రోజులుగా పెరుగుతూ వెళ్ళిన పెట్రోల్,డీజిల్ రెట్లు మొదటిసారి బుధవారం ఆయిల్ కంపెనీలు వీటి ధరలను తగ్గించాయి. అయితే ఈ తగ్గింపును చూసి వినియోగదారులు అవాక్కవుతున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మొదట విడుదల చేసిన ప్రకటన ప్రకారం లీటరు పెట్రోలు ధర 60 పైసల చొప్పున, లీటరు డీజిల్ ధర 56 పైసల చొప్పున తగ్గింది. దీంతో కాస్త ఊరడిల్లిన సామాన్యులకు కొద్ది గంటల్లోనే ఐఓసీ మరో వార్త చెప్పింది. తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం వచ్చిందని, అందుకే పెట్రోలు, డీజిల్ ధరల సవరణలో పొరపాటు జరిగిందని, తగ్గింది 60 పైసలు కాదని, ఒక్క పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ ఉదయం పెట్రోలు ధరను 60 పైసలు, డీజెల్ ధరను 59 పైసలు తగ్గిస్తున్నట్టు ఐఓసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తప్పును సరిదిద్దుకుంటున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇక ఐఓసీ తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐఓసీ జనంతో పరాచికాలు ఆడుతోందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.