Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారీ ఆకారంతో వుండే మదగజం సైతం తేనెటీగకు భయపడుతుంది. అవి రెండూ సహజ శత్రువులు. తేనెటీగలు తమకు అతి సున్నితం అయిన తొండంలో దూరి కుడతాయని ఏనుగులు భయపడుతాయి. అందుకే తేనెటీగల శబ్దం వినిపించగానే పారిపోతాయి. ఇదే పాయింట్ తో ఇప్పుడు ఇండియన్ రైల్వే ఈశాన్య రాష్ట్రాల్లో ఏనుగులను కాపాడుతోంది.
అటవీ ప్రాంతం ఎక్కువగా వుండే ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్ లకు అడ్డంగా వచ్చి ఏనుగులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో ఏనుగులు ఏటా ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. అదే సమయంలో గజరాజులను నిలువరించడం కూడా కష్టం. ఈ సమయంలో ఓ ఆలోచన మొత్తం ప్రమాదాలను నిలువరించే స్థాయికి వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే… ఏనుగులకు తేనెటీగలు అంటే భయం. వాటి ఝంకార నాదం వినగానే పారిపోతాయి కాబట్టి అలాంటి కృత్రిమ శబ్దాలను సృష్టించే పరికరాలు ఏర్పాటుచేయతలపెట్టారు. ఒక్కో పరికరం ఖర్చు కేవలం 2 వేలు. ఈ పరికరాల శబ్దం దాదాపు 600 మీటర్లు వినిపిస్తుంది. వీటి ఏర్పాటు తర్వాత ఏనుగులు రైలు ప్రమాదాల్లో చనిపోవడం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఒప్పుకుంటారా… తేనెటీగలు ఏనుగులను కాపాడుతున్నాయి అని.