Indrani killed her daughter sheena
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
షీనా బోరా హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హత్య జరిగిన మూడేళ్ల తర్వాత కానీ వాస్తవాలు బయటకు రాలేదు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెతను ఇది రుజువు చేసింది. ఇలాంటి సమయంలో హత్యలో పాలుపంచుకున్న డ్రైవర్ శ్యాంరాయ్ హత్య జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇంద్రాణి శాడిజం తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.
షీనా బోరా, రాహుల్ ముఖర్జియా ప్రేమ ఇష్టం లేని ఇంద్రాణి వారిని విడదీయడానికి ప్రయత్నాలు చేసి ఫెయిలైంది. ఇక లాభం లేదని కూతురు హత్యకు ప్లాన్ చేసింది. కుమారుడ్నీ చంపాలనుకున్నా.. అతను బతికిపోయాడు. కానీ షీనా బలైపోయింది. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, గొంతు నులిమి కన్నకూతుర్నే పాములాగా పొట్టనపెట్టుకుంది ఇంద్రాణి.
అంతటితో ఆగిపోతే కాస్త పర్లేదనుకునేవాళ్లు పోలీసులు కూడా. కానీ కూతురి శవం ముఖంపై ఇంద్రాణి కూర్చుందన్న డ్రైవర్ చెప్పిన మాటలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే అలవాటున్న ఇంద్రాణి.. కన్నకూతురితో ఇంత కర్కశంగా ప్రవర్తించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు మరింత కఠిన శిక్ష వేయాలని డిమాండ్లు వస్తున్నాయి.