Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : విజయ్ అంటోనీ, దైన చంపిక , మహిమ, జెవెల్ మేరీ
నిర్మాతలు: రాధిక శరత్ కుమార్, ఫాతిమా విజయ్ అంటోనీ
దర్శకత్వం : శ్రీనివాసన్
సినిమాటోగ్రఫీ: దిల్ రాజు
ఎడిటర్ : విజయ్ అంటోనీ
మ్యూజిక్ : విజయ్ అంటోనీ
డాక్టర్ సలీం, బిచ్చగాడు, భేతాళుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన మరో డబ్బింగ్ సినిమా ఇంద్రసేన. విజయ్ గొప్ప నటుడుని కాదని ఆయనే చెప్పుకున్నారు. అయితే కధల ఎంపికలో జడ్జిమెంట్ వల్ల ఆయన విజయాలు సాధించడమే కాదు. ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతి ఇచ్చే సినిమాలు అందించగలుగుతున్నారు. తాజాగా వచ్చిన ఇంద్రసేన తెలుగు ప్రేక్షకులకు ఎలా అనిపించిందో చూద్దాం.
కథ…
“ఇంద్రసేన “…ఇది ఇద్దరు కవల సోదరుల కథ. ఇద్దరు కవలల్లో ఇంద్రసేన పెద్దవాడు. రుద్రసేన చిన్నవాడు. వయసులో కొద్దిసేపు తేడా వున్న ఈ ఇద్దరు సోదరులు జీవితాన్ని తీసుకునే తీరు మాత్రం పూర్తి భిన్నం. జీవితాన్ని తన అదుపులో ఉంచుకునే ఇంద్రసేన వస్త్ర వ్యాపారంలో ఉంటాడు. చిత్ర అనే బ్యూటీషియన్ ప్రేమలో పడ్డ ఇంద్రసేన కి రుద్రసేన ప్రవర్తన తో ఊహించని పరిణామాలు ఎదురు అవుతాయి. జీవితం ఎటు లాక్కెళితే అటు ప్రయాణించే రుద్రసేన వ్యసనాలకు బానిస అవుతాడు. అతనికి కూడా ఓ ప్రియురాలు ఉంటుంది. అయితే దేనికైనా తేలిగ్గా అలవాటు పడిపోయే రుద్రసేన జీవితాన్ని కాపాడేందుకు ఇంద్రసేన ఎంత త్యాగం చేసాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ…
అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ విలువలు చుట్టూ కథ అల్లుకున్న దర్శకుడు జి.శ్రీనివాసన్ దాన్ని ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కుటుంబ కథ అనగానే రొటీన్ గా కాకుండా ట్విన్స్ నేపధ్యం తీసుకోవడం, జీవితాన్ని ఎలా నడుపుకోవాలో అన్న సీరియస్ పాయింట్ ను ఆ కవలల మధ్య పోల్చి చూపడం బాగుంది. ఇప్పటిదాకా మనం చూసిన కవలల కథలతో పోల్చుకుంటే ఇంద్రసేన పూర్తి భిన్నం. కధకు తగ్గట్టు కధనం అనిపించినా అది బాగా నెమ్మదిగా అనిపిస్తుంది. కధలో లీనం అయితే పెద్దగా ఆ లోటు కూడా తెలియదు. అయితే రొటీన్ వినోదం ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. విజయ్ ఆంటోనీ తనదైన స్టైల్ లో రెండు పాత్రలను చేసాడు.
రాధికా శరత్ కుమార్ , విజయ్ ఆంటోనీ కలిసి తమిళ్ లో ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమా కథ బాగా నచ్చిన విజయ్ నిర్మాత, హీరోగానే గాకుండా ఇంకెన్నో రోల్స్ లో పని చేసాడు. మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాలు కూడా అతనే చేసి సెహ్ బాష్ అనిపించుకున్నాడు. కథ రాసిన శ్రీనివాసన్ దర్శకుడు కూడా. ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ …
కథ
విజయ్ ఆంటోనీ
మైనస్ పాయింట్స్ …
స్లో న్యారేషన్
అక్కడక్కడా తమిళ వాసన
తెలుగు బులెట్ పంచ్ లైన్ …”ఇంద్రసేన “ టైటిల్ లో లగ్జరీ పాత్రకు లేదు పాపం.
తెలుగు బులెట్ రేటింగ్… 3 /5 .