భారతదేశంలో పేరొందిన బహుళజాతి సంస్థల్లో ఇన్ఫోసిస్ సాఫ్టువేర్ సంస్థ ఒకటి. అతి పెద్ద ఐటి కంపెనీల్లో ఒకటి అయిన దేశీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉన్నది. సంబందించిన కార్యాలయాలు 22దేశాలలో ఉండగా మనదేశంలో 9అభివృద్ధి కేంద్రాలు వేరేదేశాలలో 34 కార్యాలయాలను కలిగి ఉన్నది.
కాగ్నిజెంట్ బాటలో దేశీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఉద్యోగాల్లో కోత విధించనుంది. పెద్ద సంఖ్యలో ఎగువ శ్రేణి ఉద్యోగులను తీసివేసే ప్రయత్నంలో ఇన్ఫోసిస్ ఉంది. సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తుంది. ఐటీ కంపెనీలు ఆటోమేషన్ రాకతో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నం చేస్తుందని హెచ్‌ఆర్ నిపుణులు చెప్తున్నారు.
2200మంది సీనియర్ మేనేజర్లను కలిగిఉన్న ఇన్ఫోసిస్ 2నుంచి 5శాతం వరకూ జూనియర్, మిడిల్ లెవెల్ అసోసియేట్ ఉద్యోగులని ఇంకా రెండువెలకి పైగా సీనియర్ మేనేజర్లను తొలగించే అవకాశం ఉందని ఒక ఆంగ్ల దిన పత్రిక ప్రచురించిన కథనం ద్వారా తెలిసింది.