Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని సంవత్సరాల ముందు ఉన్న థియేటర్లకు ఇప్పుడు ఉన్న థియేటర్లకు చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో టూరింగ్ టాకీస్‌లు ఉండేవి. కాని ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీని అందిపుచుకుని థియేటర్లు వస్తున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్‌లు, మాల్స్ థియేటర్స్ అంటూ కొత్త కొత్తగా వచ్చాయి. ఎన్ని రకాలుగా వచ్చినా కూడా ఇప్పటి వరకు అన్ని రకాల థియేటర్‌లలో కూర్చుని చూసే హాల్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఇకపై పడుకుని సినిమా చూసే థియేటర్లను రిలయన్స్ తీసుకు వస్తుంది. రిలయన్స్ సంస్థ మాల్స్ బిజినెస్‌లో భాగంగా దేశంలోనే అతి పెద్ద థియేటర్‌ను గుజరాత్‌లోని వడోదరలో ప్రారంభించేందుకు సిద్దం చేసింది.
రిలయన్స్ సంస్థ నిర్మించిన ఆ భారీ థియేటర్‌ను ఈనెల 26న ప్రారంభించనున్నారు. రిలయన్స్ మూవీ మాల్ పేరుతో ఈ థియేటర్‌ను నిర్మించారు. ఈ థియేటర్‌లో సినిమా చూడాలి అంటే ఒక్కో మనిషికి 800 రూపాయల చెల్లించాల్సి ఉంటుంది. బెడ్, రెండు దిండ్లు ఉండి సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇటువంటి థియేటర్ దేశంలో మొదటి సారి నిర్మాణం జరిగిన నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వడోదరలోని రిలయన్స్ మూవీ మాల్ సక్సెస్ అయితే దేశంలో అలాంటి ధియేటర్లు భారీగానే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పడుకుని సినిమా చూసే వీలు ఉంటే చెత్త సినిమాలు అయితే హాయిగా నిద్ర పడుతుందేమో మరి.