Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఫిల్మ్ ఛాంబర్‌లో పవన్ నిరసన తెలియజేసిన తర్వాత సినిమా పెద్దలు అంతా కూడా భేటీ అవుతున్న విషయం తెల్సిందే. అన్నపూర్ణ స్టూడియోలో పలు విషయాలపై సినిమా పరిశ్రమ పెద్దలు భేటీ అయ్యి చర్చిస్తున్నారు. గత కొంత కాలంగా మీడియా వారు సినిమా పరిశ్రమకు చెందిన వారిని తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు, పరిశ్రమ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్‌పై కొన్ని ఛానెల్స్ తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రసారం చేసింది. వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్ డిమాండ్ చేయడం జరిగింది. తాజాగా అల్లు అరవింద్ అదే విషయాన్ని సినిమా పెద్దల ముందు ఉంచడం జరిగింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మా కార్యవర్గం మరియు నిర్మాతల మండలితో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన వారితో భేటీ కొనసాగింది. ఆ భేటీలో కొన్ని ఛానెల్స్‌పై బ్యాన్ విధించానే ప్రతిపాదనను అల్లు అరవింద్ తీసుకు వచ్చాడు. అయితే అల్లు అరవింద్ ప్రతిపాధనను అంతా కూడా తోసిపుచ్చడం జరిగింది. అలాంటి బ్యాన్ చేయడం వల్ల సినిమా పరిశ్రమపై సదరు మీడియా సంస్థల్లో ఇంకా బ్యాడ్‌గా ప్రసారం చేసే అవకాశాలున్నాయని కొందరు అభిప్రాయ పడ్డట్లుగా తెలుస్తోంది.