Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నయనతార పెళ్లితో బాలయ్య హర్ట్ అయిపోయాడు. అసలు ఆమెకి పెళ్లి ఎప్పుడు అయ్యింది? . ఆమెకి పెళ్లి అయితే ఈయన ఎందుకు హర్ట్ కావడం అనే కదా మీ సందేహం. మేము చెప్పేది నిజం. అయితే ఇది నిజ జీవితంలో కాదు. రాబోయే సినిమాలో ప్రముఖ తమిళ దర్శకుడు కె. ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాకి సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ పాయింట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యకి 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదట …సారీ…ఆయనే చేసుకోడట. అందుకు కారణం నయనతార అట. ఒకప్పుడు ఈ ఇద్దరూ ప్రేమికులట. అయితే నయనతార వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో భగ్నప్రేమికుడైన బాలయ్య అసలు పెళ్ళికే దూరంగా ఉంటాడట.
పెళ్లి చేసుకోకుండా అలా బతుకున్న బాలయ్య కి మళ్లీ నయనతార కనపడ్డంతో కథ కొత్త మలుపు తిరుగుతుందట. ఈ సినిమా గురించి మొదట చెప్పుకున్నప్పుడు ఇదేదో ఇంకో ఫ్యాక్షన్ స్టోరీ అన్నట్టు అనుకున్నారు. అయితే లీక్ అయిన విషయాలు చూస్తే ఇదేదో రొటీన్ ఫ్యాక్షన్ సినిమా కాదని, కథా బలం వున్న సినిమా అని అర్ధం అవుతోంది. ఈ సినిమా బాలయ్య కన్నా దర్శకుడు కె. ఎస్ . రవికుమార్ కి ప్రతిష్టాత్మకం. ఒకప్పుడు రజని, కమల్ వంటి టాప్ స్టార్స్ తో సినిమాలు చేసి నరసింహ, దశావతారం వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్లాప్స్ తో ఆయన కెరీర్ ఇబ్బందిలో పడింది. రజని తో తీసిన లింగా ప్లాప్ తర్వాత రవికుమార్ ఇమేజ్ బాగా డామేజ్ అయ్యింది. దీంతో పూర్వ వైభవం కోసం ఎంతో కసితో తయారు చేసుకున్న కథతో ఎంతోమంది దగ్గరికి తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్రం, భాష మారి వచ్చిన ఈ కథ బాలయ్యకి నచ్చడంతో సినిమా స్టార్ట్ అయిపోయింది.