Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియన్ ఐటీ ఫీల్డ్ స్తబ్ధుగా ఉన్న సమయంలో విదేశీ కంపెనీలు మేమున్నామంటున్నాయి. ఇండియన్ బేస్డ్ ఐటీ కంపెనీలు ఆదాయవ్యయాలను బేరీజు వేసుకోలేక కుదేలవుతూ.. ఉద్యోగాలు తగ్గించేస్తున్నాయి. అయితే విదేశీ కంపెనీలు మాత్రం భారత్ టెకీల కోసం కాచుక్కూర్చుకున్నాయి. వాళ్లొస్తే చాలు ఉద్యోగాలు మేమిస్తాం అంటున్నాయి.
మల్టీ నేషనల్ కంపెనీలుగా పేరున్న అసెంచర్, క్యాప్ జెమిని, ఒరాకిల్, ఐబీఎమ్, గోల్డ్ మన్ శాక్స్ లాంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాలున్నాయని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అమెరికాలో కంటే ఇండియాలో నాలుగు రెట్ల ఎక్కువ ఉద్యోగాలున్నాయని చెబుతున్నారు. నిజంగా అన్ని అవకాశాలు ఉన్నాయా.. లేదంటే ఇండియన్ ఐటీ కంపెనీల కంటే తామే బెటర్ అని చెప్పుకోవడానికి అలా చేస్తున్నాయా అనే అనుమానాలూ వస్తున్నాయి.
ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల పనితీరు బాగోలేదు. అమెరికా అయినా, ఇండియాలో అయినా ఎక్కడైనా మార్కెట్ డౌన్ అయింది. అలాంటి పరిస్థితుల్లో ఇండియన్ కంపెనీలకు రాని లాభాలు.. విదేశీ కంపెనీలకు ఎలా వస్తాయని టెకీలకు డౌట్లొస్తున్నాయి. అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడోచోట జాబ్ గ్యారెంటీ ఉంటే అంతకంటే ఏం కావాలని వారు సరిపెట్టుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: