కరోనా.. ఇదో… చైనా బయో వెపన్…?

ఇప్పుడు ప్రపంచాన్ని గడగడాడిస్తోన్న వైరస్ కరోనా. చైనాలో పుట్టి విశ్వమంతా వ్యాపించి మనిషి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనీయకుండా భయపెడుతోన్న మహమ్మారి కరోనా. ఈ కరోవా వైరస్ పై ప్రపంచ దేశాలకు పలు అనుమానాలు ఉత్పన్నమౌతున్నాయి.

అసలు ఈ కరోనా వైరస్ ప్రపంచంలోని మొత్తం 197 దేశాల్లో వ్యాపించింది. ఫలితంగా ప్రపంచానికే కరోనా ఫోబియా పట్టుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో 418273 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 108323 మంది కరోనా నుంచీ బయటపడ్డారు. వారిలో మృతుల సంఖ్య 18609కి చేరింది. ప్రస్తుతమున్న 291341 కేసుల్లో బాధితులకు వైరస్ ఉంది. వీరిలో 278360 మందికి వైరస్ లక్షణాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వీరు కోలుకునే అవకాశాలున్నాయి.

అయితే ఇక్కడ ఓ రహస్యాన్ని తెలుసుకోవాలి. మొదట చైనాలో కేసులు వాటి తాలూకూ వివరాలను చూసుకుంటే.. మొత్తం 81218 కేసులుంటే.. 3281మంది చనిపోయారు. సుమారు 73653మంది కోలుకున్నారు. ఇక 4287మందికి మాత్రమే కరోనా ఉంది. ఇప్పుడు కొత్తగా కేసులు మాత్రం నమోదు కావడం లేదు.

ఇక ఇటలీలో చూసుకుంటే.. మొత్తం కేసులు 69176 నమోదు కాగా.. 6820మంది మృత్యువాత పడ్డారు. 8326 మంది కోలుకున్నారు. ఇంకా 54030మంది కరోనాతో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే.. అమెరికాలో మొత్తం 54867 కేసులు నమోదుకాగా.. 782మంది చనిపోయారు. వారిలో 378మంది మాత్రమే కోలుకున్న వారిలో ఉన్నారు. 53707మంది కోరనాతో జీవిత పోరాటం చేస్తున్నారు. ఇక స్పెయిన్, జర్మనీ, ఇరాన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, బ్రిటన్ లలో కేసులు, మరణాలు ఎక్కువగా ఉంది. ఇంకా కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదౌతున్నాయి.

కాగా చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. అక్కడి ప్రజలకు స్వాంతన చేకూరుస్తుంది. ఇక్కడే అసలైన అనుమానం ప్రపంచ దేశాలకు కలుగుతుంది. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, అమెరికా.. వంటి దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. భారత్‌లో కూడా దాని ప్రభావం రోజురోజుకూ పెరుగుతుంది. అసలు ఈ వైరస్ ఏదో దానికై అది పుట్టి వ్యాపిస్తున్నది కాదని.. జీవాయుధంలా చైనా దీన్ని సృష్టించి.. మారణహోమాన్ని సృష్టించేందుకు.. అమెరికాతో పాటు శత్రు దేశాలపైకి వదలిందని పలువురు ఆరోపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇదే తరహా వాదాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. తాజాగా.. అమెరికాకు చెందిన ఓ లాయర్ కూడా చైనా ప్రభుత్వంపై దావా వేశారు. ల్యారీ క్లేమన్ అనే లాయర్.. చైనా సర్కార్, చైనా ఆర్మీ, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, డైరెక్టర్ ఆఫ్ వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ షీ షెంగ్లీ, చైనా ఆర్మీ మేజర్ జనరల్ చెన్ వెయ్‌పై అమెరికా కోర్టులో 20 ట్రిలియన్ డాలర్ల దావా వేశారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమైనాయి. చైనా దెబ్బ మామూలుగా లేదని అందుకు ఏ విధంగా స్పందించాలో తెలియక తికమకపడుతున్నాయి.