Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా బాబా దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ ఎక్కడ ఉంది…ఏమై పోయింది…అన్న విషయాలపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. డేరాబాబా అరెస్టు తర్వాత హఠాత్తుగా కనిపించకుండా పోయిన ఆమె ఎక్కడికి వెళ్లింది అనే దానిపై డేరా ఆశ్రమ అధికారులకు కూడా సమాచారం లేదు. డేరాలో ఎప్పుడైనా…ఎక్కడైనా తిరగగలిగన స్వేఛ్ఛ ఉన్న హనీప్రీత్ కు ఆశ్రమంలో అణువణువూ తెలుసు. గుర్మీత్ రామ్ రహీమ్సింగ్ అకృత్యాలకు హనీప్రీత్ ప్రత్యక్ష సాక్షి. అందుకే గుర్మీత్ కు శిక్ష విధించిన తరువాత ఆయనకు సంబంధించిన మిగిలిన కేసులపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు హనీప్రీత్ ను అరెస్టు చేయనున్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై సమాచారం అందుకున్న హనీప్రీత్ పోలీసుల కన్నుగప్పి తప్పించుకుపోయింది.
ఆమె దేశం విడిచి నేపాల్ వెళ్లిపోయిందన్న వార్తలు వినిపించాయి. మరోవైపు హర్యానా పోలీసులు ఆమెను అరెస్టు చేసి రహస్యంగా విచారణ జరుపుతున్నారన్న వాదనా వినిపించింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని హర్యానా పోలీసులు చెబుతున్నారు. హనీప్రీత్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు. గత నెల 25న హనీప్రీత్ చివరగా పోలీసులకు కనిపించింది. అప్పుడు గుర్మీత్ ను కలిసేందుకు హనీప్రీత్ రోహ్తక్ జైలుకు వచ్చింది. అయితే జైలు అధికారులు అనుమతించకపోవటంతో డేరా బాబా అనుచరులు ఆమెను వాహనంలో తీసుకువెళ్లారు. ఆ తర్వాత హనీప్రీత్ మళ్లీ కనిపించలేదు. మరోవైపు హనీప్రీత్ ప్రాణాలకు ముప్పుఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హర్యానా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గుర్మీత్ అకృత్యాలకు సాక్షి అయిన హనీప్రీత్ ను చంపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఐబీకి సమాచారం అందింది. దీంతో హర్యానా ప్రభుత్వం అలర్ట్ అయింది. రోహ్ తక్ జైలుకు వచ్చిన దగ్గరనుంచి డేరా బాబా తనతోపాటు హనీప్రీత్ ను కూడా జైలులో ఉంచాలని పదే పదే పోలీసులను కోరుతున్నాడు. డేరా బాబాను పంచకుల కోర్టు దోషిగా నిర్ధారించిన రోజు ఆయనను కోర్టు హాలు నుంచి తప్పించేందుకు హనీప్రీత్ స్కెచ్ వేసింది. చేతిలో ఎర్రబ్యాగు ఉంచుకుని డేరా బాబా అనుచరులకుసంకేతాలు ఇచ్చింది. ఆ సంకేతంతో బాబా దోషిగా నిర్దారణ అయిన విషయం తెలుసుకుని అనుచరులు విధ్వంసానికి దిగారు. డేరా బాబా పన్నాగాన్ని పసికట్టిన హర్యానా పోలీసులు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన్ను రోహ్ తక్ జైలుకు తరలించారు. తన పథకం విఫలం కావటంతో కోర్టు హాలు నుంచి హనీప్రీత్ వెళ్లిపోయింది.
హనీప్రీత్ ను డేరాబాబా పైకి దత్తపుత్రికగా చెప్పుకుంటున్నా.వారిద్దరికీ మధ్య అవాంఛనీయ సంబంధముందని ఆశ్రమంలో కొందరు ఆరోపిస్తున్నారు. హనీప్రీత్ మాజీ భర్త కూడా ఈ విషయాన్ని నిర్ధారించాడు. డేరా బాబా తీసిన పలుసినిమాల్లో కూడా హనీప్రీత్ నటించారు. కొన్నేళ్లగా సాగుతున్న వారి బంధంతో హనీప్రీత్ ఆశ్రమంలో బాబా తర్వాతి స్థానంలో నిలిచింది . డేరాబాబా జైలుకెళ్లిన తరువాత ఆయన వారసురాలిగా హనీప్రీత్ పేరు వినిపించింది. కానీ పోలీసులు అరెస్టు చేస్తారన్న భావనతో హనీప్రీత్ హఠాత్తుగా ఆశ్రమం నుంచి మాయం అయింది.
మరిన్ని వార్తలు: