మోడీ స్కెచ్…కేసీఆర్ ని గ్రిప్ లో పెట్టుకునే ఏర్పాట్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో నామినేషన్ సమయంలో డిక్లేర్ చేసిన ఆస్తులకు… 2018 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల సమయంలో డిక్లేర్ చేసిన ఆస్తులకు మధ్య చాలా తేడా ఉందని ఐటీ శాఖ భావిస్తోంది. అయితే.. ఆ మేరకు ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్‌లో చూపించలేదని గుర్తించారు. ఈ నాలుగేళ్ల ఐటీ రిటర్న్స్… ఆస్తులను.. పరిశీలించిన తర్వాత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఆస్తి 2014లో రూ. 15.16 కోట్లుండగా 2018 ఎన్నికల అఫిడవిట్ నాటికి అది రూ. 23.55 కోట్లకు చేరింది. ఐటీ నోటీసులు ఒక్క కేసీఆర్‌కు మాత్రమే కాదని.. టీఆర్ఎస్ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలకూ ఈ నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. భారీగా ఆస్తులు పెరిగిన ఎమ్మెల్యేలు ఈ నోటీసులు అందుకున్నారని అంటున్నారు. కేటీఆర్ ఆస్తి నాలుగేళ్ల కాలంలో రూ. 7.98 కోట్ల నుంచి రూ. 41.83 కోట్లకు పెరిగింది. అలాగే ఓ పాతిక మంది ఎమ్మెల్యేలు కూడా ఈ నాలుగేళ్లలో వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ను మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వారికి కూడా నోటీసులు పంపినట్లు. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టారు. లెక్కల్లో తేడాలుంటే, అందుకుగల కారణాలను ఆధారాలతో సహా వివరించాలని ఈ నోటీసుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. కేసీఆర్ మూడు నెలల ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో… ఆ ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు భావిస్తున్నారు. అయితే ఫార్మల్‌గానే ఈ నోటీసులు వస్తూ ఉంటాయని… వీటికి వివరణ పంపితే సరిపోతుందని.. కొంత మంది చెబుతున్నారు. అయితే తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ పోటీ చేసిన అభ్యర్థులెవరికీ.. ఇలాంటి ఐటీ నోటీసులు జారీ అయినట్లుగా సమాచారం లేదు. మరి టీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఎందుకు నోటీసులు జారీ చేశారనే దాని మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే మోడీ ప్లాన్ లో భాగంగానే ఇది జరిగిందని ఎందుకంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ పంచాయతీలు చేయడం నచ్చని మోడీ తన మాట వినకుంటే ఏదైనా జరగచ్చు అంటూ ఆయనను బెదిరించే క్రమంలో ఈ నోటీసులు అందేలా చేశారని అంటున్నారు.