Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కృతజ్ఞత, కృతఘ్నత… ఈ రెండు మాటలకు మధ్య రాతలో చిన్న తేడా ఉంటే, అర్ధంలో మాత్రం బోలెడంత తేడా. మొదటి దాని అర్ధం మేలు చేసినవాడు పట్ల చూపించే సానుకూల దృక్పధం, ఇక రెండో దాని అర్ధం మేలు చేసినవాడికి విశ్వాసం లేకుండా ప్రవర్తించడం. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పగ్గాలు చేతిలో వున్నప్పుడు, అవి పోయినప్పుడు కూడా ఐవైఆర్ కృష్ణారావు రెండో మాటకే అర్థంలా నిలిచారు. ఓ వైపు టీడీపీ సర్కార్ భిక్షతో ఓ కార్పొరేషన్ ఛైర్మన్ గా వ్యవహరిస్తూనే ఆ పార్టీ కి నష్టం చేసేలా సోషల్ మీడియాని వాడేశారు. ఆలస్యంగా మేలుకున్న సర్కార్ అతన్ని పదవి నుంచి తొలిగించాక ఆ కృతఘ్నత ఇంకాస్త ఎక్కువగా కనిపించింది ఆయన మాటల్లో.
ఏపీ సర్కార్ ఊస్టింగ్ చేసాక ఐవైఆర్ కృష్ణారావు ఆ అంశంతోపాటు, తనపై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ బాధ్యతాయుతమైన పదవిలో వుంటూ సోషల్ మీడియా లో నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే తప్పేంటని నిస్సిగ్గుగా ఎదురు ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు, దానికి తొలి ఛైర్మన్ గా నియమించినందుకు కనీస కృతజ్ఞత తెలపకపోగా ఆంధ్ర ప్రజలకు నిజాలు తెలియడం లేదని ఓ సంచలన కామెంట్ చేశారు. వార్త, ఉదయం లాంటి న్యూట్రల్ పేపర్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక సీఎం బాబుని బెదిరిస్తున్న ధోరణిలో రాజధాని గురించి తనకున్న కొన్ని అభిప్రాయాల్ని పుస్తకరూపంలో రాయబోతున్నట్టు ఐవైఆర్ వెల్లడించారు. దీంతో పాటు మరికొన్ని విషయాలు కూడా వున్నాయంటూ సగటు రాజకీయ నేతలా నోరు చేసుకున్న ఐవైఆర్ నిజంగా వైసీపీ కనుసన్నల్లో ఆడుతున్నట్టే వుంది.