మెగాస్టార్ చిరంజీవి , తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భోళా శంకర్.. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చిన ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళా వేదికలో చాలా ఘనంగా నిర్వహించారు.
హైపర్ ఆది మాట్లాడుతూ.. ఒక సాధారణమిడిల్ క్లాస్ ఫామిలీకి చెందిన ఒక యువకుడు యుద్ధభూమిలో సైనికుడిని అయి యుద్ధం చేస్తానని దిగి ఒకరోజు యుద్ధం చేసి గెలిచారు. 30 ఏళ్ల పాటూ యుద్ధ భూమిని ఏలారు. ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.. అన్నయ్య ఎంతోమంది సినీ సైనికులను తయారు చేసి ఇంద్రసేనాని అయితే.. తమ్ముడు ఏమో జనసైనికులను తయారుచేసి జనసేనాని అయ్యారు. మాట్లాడే వాడికి కూడా గూస్ బంప్స్ వచ్చేలా.. ఆయన మాట్లాడుతారు.. మాములుగా హీరోలకి అభిమానులు ఉంటారు.. కానీ చిరంజీవి గారికి హీరోలే అభిమానులుగా మారిపోతారు.
టాలీవుడ్ లోనే ఒక దర్శకుడు ఉన్నాడు.. ఆయనను అనే స్థాయి నాకు లేదని .. అలాగని మెగాస్టార్ ను, పవర్ స్టార్ ను అనే స్థాయి ఆయనకు లేదు.. స్మాల్ పెగ్ వేస్తే మెగాస్టార్ ను.. బిగ్ పెగ్ వేస్తే పవర్ స్టార్ ను రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. నాకు తెలిసి మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా అన్ని బెడిసి కొడతాయి అంటూ పరోక్షంగా రాంగోపాల్ వర్మ కు కౌంటర్ ఇచ్చారు .. మరి దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.