ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయిన విషయం తెల్సిందే. జబర్దస్త్ కార్యక్రమంతో అందరికంటే ఎక్కువ సంపాదించినది ఆది అంటూ జబర్దస్త్ కమెడియన్స్ అంటూ ఉంటారు. జబర్దస్త్ ఆది సంపాదన ఈమద్య బాగా పెరిగిందట. సినిమాలు, కార్యక్రమాలు ఇలా అనేక రకాలుగా డబ్బులు సంపాదిస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ గత రెండు మూడు ఎపిసోడ్స్‌గా ఆది కనిపించడం లేదు. దాంతో ఆదిని తొలగించారంటూ కొందరు, ఆదికి పారితోసికం తక్కువ అయ్యి మానేశాడు అంటూ మరికొందరు రకరకాలుగా పుకార్లు పుట్టిస్తున్నారు. ప్రస్తుతం రైజింగ్ రాజు మాత్రమే టీంను లీడ్ చేస్తున్నారు. టీం పేరు కూడా మార్చేశారు. దాంతో ఆది రాడని తేలిపోయింది.
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో ఆదికి యాక్సిడెంట్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఒక ఈవెంట్ కోసం అమెరికాకు ఆది వెళ్లాడు. అక్కడ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆదికి యాక్సిడెంట్ అయ్యిందని, యాక్సిడెంట్‌లో ఆదికి తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ కథనాలు అల్లేస్తున్నారు. యూట్యూబ్‌లో వస్తున్న వార్తలపై తాజాగా ఆది స్పందించాడు. తనకు యాక్సిడెంట్ అయినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని, ఇలాంటి పుకార్లు నమ్మొద్దన్నాడు. ఎవడ్రా అసలు ఇలాంటి పుకార్లు పుట్టించేది. నిక్షేపంగా ఉన్న నన్ను యాక్సిడెంట్ అయ్యిందని రాయడంకు ఎలా మనసు ఒప్పిందిరా అంటూ తనదైన శైలిలో ఆ ఛానెల్స్‌పై విరుచుకు పడ్డాడు. ఆది మళ్లీ జబర్దస్త్‌లోకి వస్తాడా రాడా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.