యువరాణి బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్

యువరాణి బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్

క్రిష్ – పవన్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దాని పై చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్న క్రమంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించబోతుందని ఇప్పటికే మేము వెల్లడించాము. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె బల్క్ డేట్స్ ను కేటాయించింది. అలాగే ఈ చిత్రంలో ఆమె యువరాణిగా కనిపిస్తుందట. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందట.

మరి ఇంతకీ ఆ రాజు ఎవరు? ఆ పీరియాడిక్ డ్రామా ఏమిటి? అనేది చూడాలి. ప్రస్తుతానికి, ఈ చిత్రం అయితే పాన్-ఇండియా రేంజ్ లో రూపొందుతుంది. అలాగే పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.