ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో పోరులో భారత్ లక్ష్యానికి చేరువగా దూసుకెళ్తోంది. ఆశలు సన్నగిల్లిన సమయంలో ఆల్‌రౌండర్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ కేవలం 39 బంతుల్లోనే 3ఫోర్లు, 3సిక్సర్లతో విజృంభించాడు. మరో ఎండ్‌లో మహేంద్రసింగ్ ధోనీ నిదానంగా ఆడుతూ మద్దతునిస్తుండటంతో భారత్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. భారీ షాట్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు. 42 ఓవర్లకు భారత్ 6 వికెట్లకు పరుగులు చేసింది. జడేజా(54), ధోనీ(29) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 42 బంతుల్లో 69 రన్స్ చేయాల్సి ఉంది.