Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సొంత నియోజకవర్గంలోనే గెలవరని మంత్రి జగదీష్ రెడ్డిపై సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉంటే.. తాను ఏపీలో అయినా గెలిచి చూపిస్తానని ఆయన సవాల్ విసిరి ఇబ్బందుల్లో పడ్డారు. అసలు తెలంగాణలోనే దిక్కులేకపోతే.. ఏపీలో ఏం చేస్తారని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. జగదీష్ రెడ్డి కనీసం రెండు రాష్ట్రాల సంబంధాల విషయంలో కూడా సరిగా వ్యవహరించలేదని, అలాంటి వ్యక్తికి డిపాజిట్లు కూడా రావని తేల్చేస్తున్నారు.
జగదీష్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాల వెనుక పెద్ద కారణం ఉంది. జగదీష్ ఓవరాక్షన్ గమనించిన కేసీఆర్.. ఇప్పటికే ఆయన పనితీరుపై చాలా సర్వేలు చేయించారు. అన్ని సర్వేల్లోనూ అతి తక్కువ మార్కులే వచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా.. ఇవ్వరా అనే చర్చ జోరుగా నడుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది.
జగదీష్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే.. డేంజరేనని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే వీలైతే కఠిన నిర్ణయం తీసుకుని ఆయన్ను పక్కకు తప్పించాలని భావిస్తున్నారు. మరి ఇంత జరుగుతుంది కాబట్టే.. జగదీష్ కు టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియకుండా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అసలు తానేం చెబుతున్నారో తనకే తెలియని స్థితిలో జగదీష్ ఉన్నారని సన్నిహితులే వాపోతున్నారు.
మరిన్ని వార్తలు: