ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకి శాసన మండలిలో బ్రేకులు పడిన సంగతి తెల్సిందే. సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసన మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క అమరావతి రైతులు రాజధానిని తరలించేందుకు వీలు లేదు అంటూ హైకోర్టు లో పిటిషన్ లు కూడా దాఖలు చేసారు. అయితే ముఖ్యమంత్రి జగన్ వీటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తాను తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు.
కర్నూలు కి ఏపీ విజిలెన్స్ కార్యాలయం మరియు కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాన్ని తరలించేందుకు జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణం కోసం జగన్ 19.73 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేయడం జరిగింది. ఐటీ శాఖకి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసక్తికర విషయమేమిటంటే సెక్రెటరియేట్ ని విశాఖ కి తరలిస్తే మిలీనియం టవర్ లోనే కార్యకలాపాల్ని నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది.