Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ లో చేరేటప్పుడు జగన్ తర్వాత స్థానం మనదే అనుకుంటూ వచ్చిన సేనియర్లకు షాక్ మీద షాక్ తగిలే రోజు వచ్చింది. ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితి మీద ఓ సర్వే నిర్వహించారట. మొత్తం మూడు జిల్లాల్లో పార్టీ పరిస్థితి బాగా లేదని ఆ సర్వే లో తేలిందట. అందుకు కారణం ఏంటని తెలుసుకునేందుకు ఇంకో ఉప సర్వే
నిర్వహించారు. అందులో బొత్స, ధర్మాన వంటి వారి పని తీరు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వాళ్ళు పార్టీకి ప్లస్ కాకపోగా ఒకప్పుడు వారు చేసిన తప్పులే ఇప్పుడు పార్టీ ముందర కాళ్ళకి బంధాలు వేస్తున్నట్టు పార్టీ శ్రేణుల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఇదే విషయాన్ని, సర్వే ఫలితాల్ని జగన్ ముందు వుంచారట ప్రశాంత్. ఆయన కూడా ఆ సర్వే ఫలితంతో ఏకీభవించారట.
ఇటీవల విశాఖలో వైసీపీ నిర్వహించిన మహాధర్నా లో ఆ సర్వే ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. అంతటి మహాధర్నాలో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉద్దండులుగా పేరు పడ్డ బొత్స, ధర్మాన హడావిడి చేయడానికి రెడీ అయ్యారు. కానీ జగన్ దూతల దగ్గర నుంచి వచ్చిన ఓ సందేశంతో ఆ ఇద్దరూ అవాక్కయ్యారట. విశాఖ మహాధర్నాకి మీరు రాకుండా ఉంటే మంచిదని వచ్చిన కబురు విని బొత్స, ధర్మాన షాక్ తిన్నారట. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదట. లోటస్ పాండ్ లో ఈ ఇద్దరు నేతలకు అంతకు ముందు, ఇప్పుడు దక్కుతున్న మర్యాదలో తేడా వచ్చిందట. అది ఆ ఇద్దరు నేతలకు కూడా అర్ధం అవుతున్నా ఏ ప్రత్యామ్న్యాయం లేక అవమానాలు భరిస్తూ వస్తున్నారట. అయితే ఎన్ని అవమానాలు భరించినా ఒక్కసారి దూరం పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నాక ఆ పరిస్థితిలో ఇక మార్పు వచ్చే అవకాశం ఉంటుందా?