Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
YS Jagan Planned To Padayatra On October 27th
ప్రతి తండ్రి తన కొడుకు తండ్రిని మించిన తనయుడు కావాలనుకుంటారు. కానీ వైఎస్ మాత్రం జగన్ ను ఎలా దూరం పెట్టేవారో రోశయ్య గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాంటి జగన్ ఇప్పుడు వైఎస్ బాటలో నడుస్తున్నారు. తండ్రి లాగే అధికారం కోసం పాదయాత్రకు సిద్ధమౌతున్నారు. కానీ అసలు పాదయాత్ర జరుగుతుందా.. ప్రభుత్వం అనుమతించినా జగన్ చేయగలరా అనే ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.
2004 ఎన్నికలకు ముందు వేసవిలో వైఎస్ తలపెట్టిన పాదయాత్ర కాంగ్రెస్ కు పూర్వవైభవం తెచ్చింది. ఇక చంద్రబాబైతే గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతిపక్ష నేతగా ఉన్న పదేళ్ల కాలంలో రెండు, మూడు సార్లు రెండు తెలుగు రాష్ట్రాల్ని చుట్టొచ్చారు. కానీ జగన్ మాత్రం అధికారం కోసమే యాత్ర చేస్తున్నారని అర్థమైపోతోంది. జగన్ అసలు స్వరూపం తెలిసిన వైసీపీ నేతలు కూడా.. ఆయన్ను జనం ఎంతవరకూ నమ్ముతారో డౌటే అంటున్నారు.
అధికారమే పరమావధిగా పనిచేస్తున్న జగన్.. జన సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. ఓ ఎమ్మెల్యేగా, వైఎస్ కొడుకుగా తాను చేయాల్సిన సహాయాలు కూడా చేయని జగన్.. రేపు సీఎం అయ్యాక మాత్రం ఏం ఉద్ధరిస్తారని అనుమానాలు ముసురుకుంటున్నాయి. దీంతో అక్టోబర్ 27 నుంచి జరిగే జగన్ పాదయాత్రపైనే ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నాయి.
మరిన్ని వార్తలు: