నంద్యాల ఓటర్లు ఏమనుకుంటున్నారు..?

TDP likely to pick Bhuma family member for Nandyal by election

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

TDP likely to Pick Bhuma Family Member For Nandyal By Election

జగన్ రాజకీయ అరంగేట్రం చేసిన సమయంలో పులివెందుల, ఆ తర్వాత జయ మరణంతో ఆర్కేనగర్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయాయి. ఇప్పుడు కీలక నేతలు పోటీలో లేకున్నా నంద్యాల పేరు కూడా ఆ స్థాయిలో మార్మోగిపోతోంది. నంద్యాలలో ఉపఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే రెండు ప్రధాన పార్టీలు తమ బలగాల్ని మోహరించి.. ఇప్పట్నుంచే ప్రచారం చేస్తున్నాయి. సానుభూతి ఎడ్జ్ భూమా కుటుంబానికి ఉందన్న కోణంలోనే బాబు వారికే టికెట్ ఇచ్చారు.

కానీ శిల్పాకు అనుకూలంగా పరిస్థితి ఉందన్న విషం జగన్ బ్యాచ్ ప్రచారం చేస్తోంది. అయితే అందులో నిజం లేదని టీడీపీ వారు చెబుతున్నారు. ఎందుకంటే శిల్పాకు అంత సీన్ ఉంటే.. బాబే టికెట్ ఇచ్చేవారని గుర్తుచేస్తున్నారు. కానీ జగన్ పార్టీ వాదన మరోలా ఉంది. రాజకీయంగా శిల్పా, భూమా సమానమేనని, సానుభూతి ఎడ్జ్ కంటే టీడీపీ అంతర్గత విభేదాలే ఎక్కువగా ఉన్నాయనేది వారి విశ్లేషణ. కానీ టీడీపీ ఈ విమర్శల్ని కొట్టిపారేస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీలో చాలా అంతర్గత విభేదాలున్నాయని, కానీ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయబట్టే పార్టీ అధికారంలోకి వచ్చిందంటున్నారు. ఇప్పుడు జగన్ చెప్పినట్లుగా నేతలు వేర్వేరుగా ప్రచారం చేస్తున్నా.. అందరూ టీడీపీ కోసమే పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలంటున్నారు. పైగా బాబు పీకిన క్లాస్ తో అనవసర గొడవలు అవాయిడ్ చేయడానికే, జగన్ వర్గంలో అయోమయం సృష్టించడానికే ఇలా ప్రచారం చేస్తున్నారనే వాదన కూడా ఉంది. దీంతో ఇది నిజమా.. బాబు మైండ్ గేమా అని వైసీపీ నేతలు జుట్టుపీక్కుంటున్నారు. అటు నంద్యాల ఓటర్లు మాత్రం ఎప్పటిలాగే భూమా ఫ్యామిలీనే అందలం ఎక్కించాలని అనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఛానెల్

భారత్ కంటే చైనా బలంగా ఉందా..?