రాజధానిని మార్చే ఆలోచనలో ఉన్న జగన్

రాజధానిని మార్చే ఆలోచనలో ఉన్న జగన్

తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుంది. ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్ ఎలాగైతే ఉమ్మడి రాజధాని ఉన్నదో అలానే ఉమ్మడి రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. కానీ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన కొన్ని రాజకీయ కారణాల వలన హైదరాబాద్ నుంచి అమరావతికి రాజదానిని మార్చారు.

అదే సమయంలో రాజధాని ఎక్కడ ఉండాలి అనే విషయంపై చర్చకు వచ్చినపుడు మొదట మంగళగిరి సమీపంలో ఉన్న నాగార్జున విశ్వవిద్యలయంలో రాజధానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలనీ మొదట అనుకున్నారు. అక్కడ కట్టడాలు ఉన్నాయి. వాటిని కొద్దిగా మార్చి రాజధానిగా మార్చుకోవచ్చు. కానీ, అమరావతి పేరులో దూరంగా రాజధానిని కట్టాలని అనుకున్నారు.

2018 వరకు మొదటిదశ నిర్మాణాలు పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఏం జరిగింది. 2019 ఎన్నికలు పూర్తయ్యాయి కానీ, శాశ్వత నిర్మాణాల అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు జగన్ రాజధానిని మార్చే ఆలోచనలో ఉన్నారు. రాజధానిని అమరావతి నుంచి నాగార్జున విశ్వవిద్యాలయంలోకి మార్చి న్యూ అమరావతి పేరుతో డెవలప్ చేయాలనీ చూస్తున్నారు. ఇక విశ్వవిద్యాలయాన్ని అక్కడి నుంచి మరొక చోటికి షిఫ్ట్ చేయాలన్నది ప్లాన్.

మొదటి నుంచి అనుకున్నట్టుగా హైకోర్టును కర్నూలుకు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ప్రాధమికంగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం. నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో అప్పటి నుంచి కొన్ని రోజుల వ్యవధిలోనే రాజధానిని నిర్మాణం పూర్తి చేయాలనీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోబోతున్నది. ఇదే నిజమైతే బాబు చేయాలని పనిని జగన్ చేసి చూపించాడని అర్ధం చేసుకోవచ్చు. మరి జగన్ ఈ పని చేస్తారంటారా.. వస్తున్నవి ఊహాగానాలేనా లేదా నిజమా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.