బిగ్‌ బౌట్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌లో నిఖత్‌

బిగ్‌ బౌట్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌లో నిఖత్‌

“బిగ్‌ బౌట్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌’” తొలిసారి భారత బాక్సింగ్‌ సమాఖ్య-బీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరుగ నుంది. తొలిసారి నిర్వహించనున్న బిగ్‌ బౌట్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌లో బరిలో దిగే బాక్సర్ల వివరాలను ప్రకటించారు. మొత్తం ఆరు జట్లు ఆడుతూ బిగ్‌ బౌట్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌ డిసెంబర్‌ 2 నుండి 21 వరకు జరుగబోనున్నది. ఒడిశా వారియర్స్‌కు తెలంగాణ బాక్సర్, ప్రపంచ జూనియర్‌ మాజీ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ప్రాతినిధ్యం వహిస్తుంది.

పురుషుల 52 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా ప్రసాద్‌ పంజాబ్‌ రాయల్స్‌ జట్టుకు ఆడనున్నాడు. పంజాబ్‌ రాయల్స్‌ తరఫున భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ తరఫున ఆడనుంది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌, నిఖత్‌ జరీన్‌ ఆడబోతున్నారు. ఒడిశా వారియర్స్, బెంగళూరు బ్రాలర్స్, పంజాబ్‌ రాయల్స్, టీమ్‌ గుజరాత్‌ అదానీ, బాంబే బుల్లెట్స్, నార్త్‌ ఈస్ట్‌ రైనోస్‌ జట్లు అదనున్నాయి. మహిళల విభాగంలో 51 కేజీలు, 60 కేజీలు ఇంకా పురుషుల విభాగంలో 52 కేజీలు, 57 కేజీలు, 69 కేజీలు, 75 కేజీలు, 91 కేజీలు వెయిట్‌ కేటగిరీలు ఉన్నాయి