రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నటువంటి వైసీపీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలని తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ ప్రభుత్వం తాజాగా మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానాల పరిధిని నిర్ధారిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం తాజాగా ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. కీలక ప్రాంతాలైన విజయవాడ, విశాఖల్లోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానాలకు కొన్ని పరిమితమైన పరిధిలను నిర్ణయిస్తూ రాష్ట్ర న్యాయశాఖ ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది.
వాటితోపాటే విశాఖ లోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం పరిధిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల వరకు ఉందని ఏపీ ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వుల్లో అధికారికంగా ప్రకటించింది. అంతేకాకున్న రాష్ట్రంలో నూతనంగా విజయవాడలో ఏర్పడినటువంటి సిబిఐ కి సంబందించిన అదనపు కేసుల న్యాయస్థానం పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధి వరకు మాత్రమే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.