నమ్ముకున్నోళ్ళను వదలడు జగన్ !

jagan dont leave believers

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఊరూరు తిరిగి ప్రచారం చేసిన సినీ నటుడు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో ఆ పార్టీలో చేరిన పృధ్వీ.. వైఎస్‌ జగన్‌తో కలిసి పాదయాత్రలో కొంత దూరం నడిచాడు. వైసీపీ భావజాలాన్ని పలు సందర్భాల్లో గట్టిగా వినిపించిన పృధ్వీ. ఏపీలో జగన్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పృధ్వీకి ఎట్టకేలకు ఓ కీలకమైన పదవి లభించింది. ఎస్వీబీసీ భక్తి ఛానెల్ ఛైర్మన్‌‌గా పృధ్వీని నియమించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని సినీ నటుడు పృథ్వి కలిశారు. అమరావతి సమీపంలోని జగన్ నివాసానికి వచ్చిన ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జగన్ నిర్వహించిన పాదయాత్రలో పృథ్వి కూడా నడిచారు. ఓ చేత్తో వైసీపీ జెండాను పట్టుకుని, మరో చేత్తో జగన్ చేతిని పట్టుకుని ఆయన నడుస్తున్న ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ కోసం పృథ్వి పడిన కష్టానికి జగన్ ప్రతిఫలాన్ని అందించారు.