జగన్ కి ప్రియ శత్రువు మద్దెల వాయింపు.

jagan-fan-venkat-reddy-life-threat-comments-to-pawan-kalyan-makes-jagan-trouble

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

“తాను తప్పు చేస్తే చెప్పేవాడు మిత్రుడు , తాను ఏమి చేసినా తప్పు లేదన్నవాడు ప్రియ శత్రువు”. ఒకరు ఎదుగుతుంటే ఆయన చుట్టూ ఇలాంటి ప్రియశత్రువులు చాలా మంది చేరతారు. నిజానికి శత్రువు కన్నా నిజాలు తెలుసుకునే అవకాశం లేకుండా చేసే ఇలాంటి ప్రియ శత్రువులతోనే ఎప్పుడైనా ముప్పు ఎక్కువ. ఈ చేదు వాస్తవం ఇప్పుడిప్పుడే జగన్ కి బాగా అర్ధం అవుతోంది.

గుంటూరు లో వుండే తియ్యగూర వెంకటరెడ్డికి వైసీపీ అధినేత జగన్ అంటే ప్రాణం అంట. జనసేన అధినేత పవన్ వచ్చి జగన్ గురించి మాట్లాడగానే వెంకటరెడ్డికి కోపం వచ్చింది. అది కూడా జగన్ ని పల్లెత్తు మాట అన్నోళ్ళని చంపాలి అనేంతగా. ఇంకేముంది ఉందిగా యు ట్యూబ్ . పవన్ ని చంపేస్తానని బహిరంగంగా వెంకటరెడ్డి వార్నింగ్ ఇవ్వడం అది వైరల్ కావడం క్షణాల్లో జరిగిపోయింది.

ఇదే హెచ్చరిక ఇంకోరు చేసి ఉంటే ఎలా ఉండేదో గానీ రెండు మర్డర్ కేసుల్లో నిందితుడు అయిన వెంకటరెడ్డి కావడంతో పోలీసులు అయ్యగారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రం అంతా వైసీపీ ని ప్రత్యేకంగా జగన్ ని అభిమానించే వాళ్లకి క్రిమినల్ మైండ్ ఉంటుందన్న ప్రచారం పైసా ఖర్చు లేకుండా అయిపోయింది. దీంతో అబ్బే అసలు వైసీపీ కి వెంకటరెడ్డి కి సంబంధం లేదని , జగన్ ఇలాంటి నేర చరిత్ర వున్న వారిని ప్రోత్సహించరని పార్టీ ప్రకటన చేయాల్సి వచ్చింది . దీంతో తన కోసం చావడానికైనా , చంపడానికి అయినా సిద్ధపడినవాడిని ఏ సంబంధం లేదంటున్న జగన్ ని ఎలా నమ్ముకోవాలన్న ప్రశ్న ముందుకు వచ్చింది. ఈ ప్రశ్నకి ఏ సమాధానం ఇవ్వాలో తెలియక వైసీపీ శ్రేణులు మాటల కోసం తడుముకోవాల్సి వస్తోంది. ఇలా రెండు వైపులా మద్దెల వాయింపు జగన్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.