నా చేతుల్లో లేదు….కోర్ట్ చూసుకుంటుంది…కాపుల గురించి జగన్

ఏపీలోఎన్నికలు దగ్గరపడుతున్న తఃరుణంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లోహాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ల అంశం.. ఓ రాజకీయ వివాదంగా మారిన తర్వాత జనగ్మోహన్ రెడ్డి.. నేరుగా తన అభిప్రాయాన్ని మొదటి సారి వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. కాపులకు రిజర్వేషన్లు అనేది తన చేతుల్లో లేని విషయం కాబట్ట తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని ప్రకటించారు. నేను చేయగలిగిందే చెబుతాను, చేయలేనిది చెప్పే అలవాటు నాకు లేదని చెప్పిన ప్రతిపక్ష నేత.. కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనని తెలిపారు. 50 శాతం దాటడంతో రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధిలో లేవన్నారు. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తోన్న జగన్.. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో బహిరంగసభలో ప్రసంగిస్తున్న సమయంలో కొంత మంది యువకులు.. కాపు రిజర్వేషన్లపై వైఖరి స్పష్టం చేయాలంటూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో జగన్ స్పందించక తప్పలేదు. కాపు కార్పొరేషన్ కు మాత్రం..చంద్రబాబు ఇచ్చే నిధుల కంటే రెట్టింపు ఇస్తానని ప్రకటించారు.