ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి రాయలసీమ నేతల నుండి ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ కి ఆ ప్రాంత వాసులు ఒక లేఖని రాశారు. అయితే ఆ లేఖలో గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలిపారు. రాయలసీమ కు నమ్మకం జరుగుతుందనే ఉద్దేశం ఉండటం వలనే వైసీపీ ప్రభుత్వానికి 2014 మరియు 2019 ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాం అని తెలిపారు. అయితే అసెంబ్లీ లో జగన్ ప్రకటన చేసిన రెండ్రోజులకే జీఎన్ రావు కమిటీ అదే విధంగా రాజధానుల గూర్చి వివరించింది లేఖలో తెలిపారు.
గతంలో తెలుగువారి ఐక్యత కోసం కర్నూల్ రాజధానిని త్యాగం చేసారని చెప్పుకొచ్చారు. అయితే ఇపుడు వికేంద్రీకరణ జరుగుట వలన రాయలసీమ లో రాజధానిని పునరుద్దరించమని కోరడం జరుగుతుంది అని తెలిపారు. అయితే ఇది కొత్తగా కోరుకుంటున్న కోర్కె కాదని, ఆ ప్రాంత ప్రజల త్యాగం వృధా కాకుడదనే ఉద్దేశంతో మిమ్మల్ని అబ్యర్దిస్తున్నాం అని తెలిపారు. దీని కింద కొందరు రాయలసీమ నేతలు సంతకాలు చేసి జగన్ కి పంపడం జరిగింది.