మరొక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోనున్న జగన్

మరొక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోనున్న జగన్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశం ఫై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. శాసన మండలి రద్దు ఫై విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇపుడు వీటన్నిటికీ మించి ఒక సంచలన వార్త ఆంధ్ర ప్రదేశ్ లో చర్చలకు దారి తీస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మూడు జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయనున్నారని సమాచారం. మంత్రి వర్గం కూడా దీనికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. అయితే విశాఖలోని మచిలీపట్నం, అరకు, మరియు గుంటూరు లోని గురజాల ప్రాంతాలని కొత్త జిల్లాలుగా గుర్తించారని, త్వరలోనే వీటిని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది.

అయితే పైన పేర్కొన్న మచిలీపట్నం, అరకు, గురజాల ప్రాంతాలకు వైద్య కళాశాలలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది, అయితే ఒక్కొక్క కళాశాల కు దాదాపు 5 నుండి 6 వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం వుంది. అయితే అక్షరాస్యత, వైద్య వసతులు తక్కువగా ఉండి, ఎలాంటి వైద్య కళాశాలలు లేని ప్రాంతాల్లో వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే అందుకయ్యే ఖర్చు లో భారత వైద్య మండలి 60 శాతం వరకు సమకూర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇవే కాకుండా దశల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రి వర్గం చర్చలు జరిపినట్లు సమాచారం.