కన్నా లక్ష్మి నారాయణ సంచలన వ్యాఖ్యలు

కన్నా లక్ష్మి నారాయణ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ల ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రతీ విషయం లో యూ టర్న్ తీసుకున్నాడు అంటూ ఎద్దేవా చేసారు. అయితే ప్రస్తుత జగన్ ప్రభుత్వం ప్రతీ విషయం లో రివర్స్ టర్న్ తీసుకుంటుంది అంటూ జగన్ పాలన ఫై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి చెందాల్సిన ఆంధ్ర ప్రదేశ్ కి ఇలాంటి అసమర్థ, అవినీతి పార్టీల వలన ప్రయోజనం శూన్యం అంటూ విమర్శలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో కమల వికాసమే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పరిష్కారం అని కన్నా లక్ష్మి నారాయణ అన్నారు.

కన్నా లక్షి నారాయణ చేసిన వ్యాఖ్యలకు గానూ, టీడీపీ, వైసీపీ అభిమానులు ఘాటుగా జవాబిస్తున్నారు. దేశం లో ఎక్కడా స్టేటస్ లు ఇవ్వడం లేదు, ప్యాకేజీ లు ఇస్తాం అని నమ్మించింది మీ పార్టీ నే కదా, మళ్ళీ బాబు గారి యూ టర్న్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. శాసన మండలిలో అమరావతికి మద్దతు తెలపనపుడే మీరు రాష్ట్ర ద్రోహులయ్యారు, మీ దొంగ నాటకాలు కట్టి పెట్టండి, అధికారంలో వున్నా, ప్రతిపక్షం లో వున్నా చంద్రబాబు మీద పడి ఏడ్చే మీలాంటి వారి వల్ల లాభం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.