జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు… నారా లోకేశ్.

AP Politics: Come together people.. let's fight the pandemic: Nara Lokesh
AP Politics: Come together people.. let's fight the pandemic: Nara Lokesh

జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర పెదకూరపాడు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 181వ రోజు లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. క్రోసూరులో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. అడుగడుగునా మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతూ ఆత్మీయస్వాగతం పలికారు. భారీ గజమాలలతో యువ నేతను గ్రామాల్లోకి ఆహ్వానించారు. క్రోసూరు ప్రధాన రహదారి జనంతో కిటకిటలాడింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానన్న జగన్ ఇప్పుడు రకరకాల పేరుతో ప్రజలను దోచుకుంటున్నాడని మండిపడ్డారు.

ఈ సందర్భంగా యువనేత లోకేశ్ మాట్లాడుతూ… కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతోందని ప్రతి యూనిట్ పై జే ట్యాక్స్ వేస్తున్నాడని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల భారం తగ్గిస్తామని భరోసా ఇచ్చారు. 181వ రోజున లోకేశ్ 9.5 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2420 కి.మీ.ల మేర పూర్తయింది. శనివారం సాయంత్రం యువగళం పాదయాత్ర తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

మీకు దమ్ముంటే బాబాయిని చంపినోడిని లోపలేయండని సవాల్ విసిరారు. మహిళా కానిస్టేబుల్ పై అనంతపురంలో దాడి చేస్తే గన్ ఎక్కడకి వెళ్లిందని జగన్ ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. అమ్మలాంటి అమరావతిని చంపేసిన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు.

బాబు గారు ప్రాజెక్టులు చూడటానికి వెళ్తే జగన్ భయపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఏ పర్యటనకు వెళ్లినా మొరగని వైసీపీ కుక్క లేదని అన్నారు.డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ రెడ్డికి వైసీపీ వాళ్లు వేసిన రాళ్లు కనపడలేదని మండిపడ్డారు.ఎన్నికలకు ముందు అమరావతి లోనే రాజధాని అన్నాడని విమర్శించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన అమరావతిని జగన్ విధ్వంసం చేశాడని మండిపడ్డారు.

‘జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. ఇప్పుడు జీపీఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఆఖరికి జీపీఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బు సైతం కొట్టేశాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా జగన్ కోతపెట్టాడు . 15 శాతం అలవెన్స్ కట్ చేశాడు. ఎస్ఐకి 10 వేలు, సీఐకి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేశాడు. జగన్ తెచ్చిన జీఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యథాతథంగా ఇస్తాం’ అని లోకేశ్ చెప్పారు.