Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ ఓటరు జ్ఞాపకశక్తి చాలా తక్కువ.”…ఈ స్టేట్ మెంట్ ని అక్షరాలా నమ్మినట్టుంది ప్రధాని మోడీ. 2014 ఎన్నికల ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆయన తమిళనాట ప్రచారం చేరేశారు. “ దేశ ప్రజలకు చెందాల్సిన 1 .76 లక్షల సొమ్మును దోచుకున్న దొంగలు మీ రాష్ట్రంలోనే వున్నారు. వారిని, వారికి తోడుగా ఉన్న కాంగ్రెస్ ని రాష్ట్రం నుంచి పారదోలాల్సిన బాధ్యత మీదే “ అని నాడు నొక్కిచెపిన మోడీ ఇటీవలే చెన్నై వెళ్లారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న కరుణానిధిని పరామర్శించి ఢిల్లీ వచ్చి మా ఇంటిలో విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్లారు. ఔను మరి…తమిళనాట ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డీఎంకే అధికార పగ్గాలు చేపడుతుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. అందుకే మోడీ మాట మారింది. ఈ నేపథ్యంలో 2 జి స్కాం కేసులో కనిమొళి,రాజా నిర్దోషులుగా బయటపడడంతో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి స్వయంగా తమ పార్టీ నేతలే కేసుని నీరు కార్చారని ఆవేదన చెందారు. దీంతో బీజేపీ పెద్దలు కోర్టు తీర్పుకి పెడార్ధాలు తీయడం తగదని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీలు , నేతలు ఎలా చూస్తున్నా ప్రజలు మాత్రం రాజకీయ కోణంలో చూసే అవకాశాలే ఎక్కువ.
తమిళనాట పరిణామాలు ఇక్కడ ఏపీలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ని హ్యాపీ హ్యాపీ చేశాయి. కానీ ఆయన ప్రవాహంలో కొట్టుకుపోతూ గడ్డిపోచని పట్టుకున్నట్టు ఒక్క లాజిక్ మిస్ అవుతున్నారు. తమిళనాట పరిణామాలు మారడానికి ఒకే ఒక్క కారణం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డీఎంకే గెలుస్తుందన్న నమ్మకం. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మీద ఆ నమ్మకం ఉందా అన్నది ఆయన్ని ఆయనే ప్రశ్నించుకోవాలి. తమిళనాడు అయినా ఇంకో చోట అయినా బీజేపీ వేసే ఎత్తులకు అంతిమ పరమార్ధం రాజకీయ ప్రయోజనం. అంటే జగన్ గెలుస్తాడు అన్న నమ్మకం కుదిరితేనే బీజేపీ ఆయన్ని చేరదీస్తుంది. కానీ ఏకపక్షంగా ఇప్పుడు అలా అనుకునే పరిస్థితి ఏపీ లో లేదు. ఈ చిన్న లాజిక్ అయ్యి బీజేపీ ప్రాపకం కోసం జగన్ పాట్లు పడుతున్నారు. జనంలో బలం పెరిగితే బీజేపీ తనంతట తానే ముందుకు రావొచ్చు. లేదా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తుంది. ఈ విషయాన్ని గ్రహించకుండా ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని అనుకుంటే జగన్ పప్పులో కాలేసినట్టే.