ఏపీ సీఎం వైఎస్ జగన్ వల్లే తన చిన్ననాటి కల నెరవేరిందని వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎవరు పెడతారోనని తాను చిన్ననాటి నుంచి కలలు కన్నానని, ఆ కల సీఎం జగన్ వల్ల నెరవేరిందన్నారు. మళ్లీ మళ్లీ జగన్ను గెలిపించుకుంటే మన తలరాతలు మారుతాయన్నారు. జగన్ మోహన్ రెడ్డి కారణజన్ము డు.. అభినవ అంబేద్ ర్ అని ఎమ్మెల్యే వరప్రసాద్ పేర్కొన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ… ‘గతంలో పార్టీ మారితే నాకు 100 కోట్ల వరకూ ఇవ్వాలని నారా టీడీపీ అధినేత చంద్రబాబు చూశారు. పార్టీ మారనని చెప్పడంతో ఆ తర్వాత నుంచి కనీసం మాట్లాడటానికి కూడా ఆయన నాకు అవకాశం ఇవ్వలేదు. పాదయాత్రలో జగన్ హామీలు ప్రకటిస్తుంటే.. చేయగలరా? అనుకున్నా . సీఎం అయిన తర్వాత ఆయన హామీలు నెరవేరుస్తుంటే ఆశ్చర్యపోయా. జగన్ మోహన్ రెడ్డి కారణజన్ముడు, అభినవ అంబేద్కర్. జగన్ అమ్మ ఒడి పెట్టడం వల్ల నా జీవితాశయం నెరవేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎవరు పెడతారోనని చిన్న నాటి నుంచి కలలు కన్నా, సీఎం జగన్ వల్ల నాకల నెరవేరింది’ అని అన్నారు.
‘నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి చేతులెత్తి నమస్కరిస్తున్నా . మళ్లీ మళ్లీ జగన్ను గెలిపించుకుంటే మన తలరాతలు మారుతాయి. దళితుల్లో ఎవరూ పుట్టకూడదని మమ్మల్ని చంద్రబాబు ఎంతో అవమానించారు.ఈ ప్రభుత్వంలో కేవలం దళితులకే ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల కోట్ల మేర మేలు జరిగింది. స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థను కాగ్ తప్పుపట్టడం బాధాకరం. కాగ్ వంటి సంస్థలు నివేదికలు ఇచ్చే ముందు సమాజంలో అసమానతలను చూడాలి’ అని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పేర్కొన్నారు